కాకినాడలో చిన్నారి కిడ్నాప్.. సవతి తల్లే చేసిందని నాయనమ్మ ఆరోపణ

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల కిడ్నాప్‌లు ఆగడం లేదు. ఎక్కడో చోట పిల్లలను అపహరించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు కిడ్నాపర్లు. తాజాగా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై చిన్నారి మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చిన్నారి దీప్తిశ్రీని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారే అని ఆరోపిస్తోంది చిన్నారి నాయనమ్మ. గతంలోనూ రెండు సార్లు దీప్తీశ్రీపై అమానుషంగా దాడి చేసిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన కొడుకు మొదటి భార్య చనిపోవడంతో శాంతి కుమారి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడని తెలిపింది. పెళ్లైన దగ్గర నుంచి దీప్తినిశ్రీని శాంతికుమారి వేధిస్తోందని ఆరోపిస్తుంది చిన్నారి నాయనమ్మ.
చిన్నారి నాయనమ్మ ఫిర్యాదుతో సవతి తల్లి శాంతి కుమారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. విచారణలో ఆమె నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే పాప క్షేమంగా ఉందా? దీప్తి శ్రీని శాంతి కుమారి ఏం చేసింది అనేది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com