అమెరికా అధ్యక్ష రేసులో బ్లూమ్ బర్గ్

బిలీనియర్, మీడియా మొఘల్ గా పేరుగాంచిన మిచెల్ బ్లూమ్ బర్గ్ అమెరికా అధ్యక్షుడి బరిలోకి దిగారు. ఆయన డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ రేస్ లో దిగుతున్నట్టు స్పష్టం చేశారు. అతి పెద్ద సిటీల్లో ఒకటైన న్యూయార్క్ నగరానికి మేయర్ గా పనిచేసిన ఆయన అకస్మాత్తుగా అధ్యక్ష పదవికి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. వస్తూనే డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్య, అనైతిక పాలనను మరో నాలుగు ఏళ్లపాటు భరించలేమంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బ్లూమ్ బర్గ్, ట్రంప్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్ రేసులో డెమొక్రటిక్ నుంచి ఇద్దరు ఇండో అమెరికన్ మహిళలతో పాటు మరో 15 మంది పోటీలో ఉన్నారు. సొంత పార్టీలో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ తో ఇతను పోటీపడాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com