వైఎస్సార్ ఆదర్శం పథకం ద్వారా ఉపాధి కల్పిస్తాం: సీఎస్ నీలం సహానీ

వైఎస్సార్ ఆదర్శం పథకం ద్వారా ఉపాధి కల్పిస్తాం: సీఎస్ నీలం సహానీ
X

cs

వైఎస్సార్ ఆదర్శం పథకం ద్వారా.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ అన్నారు. ఇసుక, ఇతర నిత్యావసరాలు రవాణా చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో నీలం సహానీ సమీక్ష నిర్వహించారు. లబ్దిదారుల వాటాకు బ్యాంకు రుణాలను కలిపి వాహనాలు కొనిచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ అంశంపై వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు సీఎస్‌.

Tags

Next Story