ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య వివాదం

X
By - TV5 Telugu |25 Nov 2019 3:28 PM IST
గుంటూరు జిల్లాలో ఇసుక లోడింగ్ విషయంలో రెండు గ్రామాలకు చెందిన కూలీలు ఘర్షణకు దిగారు. కొల్లిపర మండలం అన్నవరపు లంకలో ఈ ఘటన జరిగింది. ఇసుక లోడింగ్‌ను ఇతర గ్రామాల కూలీలు చేయకూదంటూ.. అన్నవరపు లంక గ్రామానికి చెందిన కూలీలు ఘర్షణకు దిగారు. దీంతో ఇరు గ్రామాల కూలీలు కర్రలతో కొట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడే పోలీసులు ఉన్న.. ఘర్షణను నియంత్రించలేకపోయారు. పోలీసులు కేవలం వీడియోలు తీసేందుకే పరిమితమయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com