'అమ్మ' నచ్చలేదు..

మా అమ్మేంటి అలా ఉంది. నిండైన రూపానికి నిదర్శనం అమ్మ. ఒక్కసారి చూస్తే మర్చిపోవడం అసాధ్యం. అసలు అమ్మలా ఎవరైనా ఉండగలరా. సినిమా తియ్యడం రాకపోతే మానేయండి. అంతేకాని మేకప్ వేసి మరో భాషలో మా అమ్మే అంటే ఎలా నమ్మేది.. అంటూ 'తలైవి' పాత్ర పోషించిన కంగనా రనౌత్ ఫోటో చూసి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ తలైవికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో జయలలిత రాజకీయ జీవితానికి సంబంధించిన రూపంతో ఉన్న ఫోటో బొమ్మలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఆమె బయోపిక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మాకు ఆదిలోనే నిరాశను కలిగించారు అని అంటున్నారు. సినిమా విడుదలయ్యే లోపు లోపాలను సవరించారా సరే సరి.. లేదంటే అమ్మ బొమ్మ అనుకున్న స్థాయిలో ఆడదు అంటూ విజయ్ పై అస్త్రాలు సంధిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com