నాకూ ఉంది ఓ లవ్ స్టోరీ.. మీకూ చెప్తా వినుకోండి..

నాకూ ఉంది ఓ లవ్ స్టోరీ.. మీకూ చెప్తా వినుకోండి..

Nagababu

మెగా బ్రదర్ నాగబాబు.. నేనూ లవర్ బాయ్‌నే.. నాకూ ఉంది ఓ లవ్ స్టోరీ అంటున్నారు. అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా బుల్లితెరను ఏలేస్తూ పండగ చేసుకుంటున్నారు నాగబాబు. ఓ ఛానెల్లో ప్రేక్షకాదరణ పొందిన జబర్థస్థ్ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఆ షో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మరో ఛానెల్‌కి జెండా ఊపారు. అక్కడ కూడా తన ఎంట్రీతో అదరగొట్టేశారు. తనకూ ఓ ప్రేమ కథ ఉందని చెప్పారు. ఒకరూ ఇద్దరూ కాదండోయ్.. ఏకంగా 9 మందికి లైన్ వేశాను.. కానీ ఒక్కళ్లు పడితే ఒట్టు. అంతా వన్ సైడ్ లవ్వు. ఎంత ట్రై చేసినా ఒక్కరూ పడట్లేదని.. ఈ లవ్వు గివ్వూ మనకు సరిపడదని అప్పటికి కానీ అర్థం కాలేదు. యంగ్ హీరోలను తలపిస్తున్న నాగబాబు గెటప్.. జబర్థస్థ్ రేంజ్‌లో తాను ప్రస్తుతం చేస్తున్న లోకల్ గ్యాంగ్స్‌ను కూడా హిట్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ షో ప్రేక్షకులను ఎంత వరకు ఆకర్షిస్తుందో చూడాలి.

Read MoreRead Less
Next Story