మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 27న పీఎస్‌ఎల్వీ-సి-47 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఉదయం 9 గంటల 28 నిమిషాలకు ఈ ఎక్స్‌పెరిమెంట్ జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి. కార్టోశాట్-3, హై రెజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను తీస్తుంది.
వాస్తవానికి ఈనెల 25నే PSLV-C-47 ప్రయోగం జరగాల్సి ఉంది. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో 4 దశల రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక అక్కడి నుంచి ప్రయోగ వేదిక మీదకు తరలించే క్రమంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో ఇబ్బంది వచ్చింది. సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు ఈనెల 23న ప్రాబ్లెమ్‌ను సాల్వ్ చేశారు. శనివారం ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ను ప్రయోగ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించారు. 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com