ఆకాశంలో అద్భుతం.. పట్టపగలే నింగిలో కారు చీకట్లు

వచ్చే నెలలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పట్టపగలే నింగిలో కారు చీకట్లు కమ్ముకోనున్నాయి. డిసెంబర్ 26న సూర్యగ్రహణం నేపథ్యంలో తిరుమల సహా పలు ఆలయాలు మూతపడనున్నాయి.
సూర్య గ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8గంటల 6 నిమిషాల నుంచి ఉదయం 11గంటల16 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు సూర్యగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు.
గ్రహణం సందర్భంగా డిసెంబర్ 26న శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని నాలుగు గంటలపాటు మూసివేయనున్నారు. ఉదయం ఏడున్నర నుంచి 11 గంటల 30 నిమిసాల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటన విడుదల చేసింది.
డిసెంబర్26న సూర్యగ్రహణం ఉదయం 8గంటల 6నిమిషాలకు ప్రారంభమై 11 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా నెయ్యాభిషేకం సహా ఆలయంలో ఏ పూజలను నిర్వహించరు. ఆలయాన్ని తెరిచిన తర్వాత పుణ్యహవచన అనంతరం పూజలు కొనసాగిస్తారు. కేవలం అయ్యప్పస్వామి ఆలయం మాత్రమే కాదు.. మాలికాపురం,పంబలో ఉన్న ఆలయాలను సైతం సూర్యగ్రహణం నేపథ్యంలో మూసివేయనున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com