ఆర్టీసీ కార్మికులకు షాక్.. విధుల్లో చేర్చుకోబోమన్న సునీల్‌ శర్మ

ఆర్టీసీ కార్మికులకు షాక్.. విధుల్లో చేర్చుకోబోమన్న సునీల్‌ శర్మ

TSRTC

సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసిన కాసేపటికే.. ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ షాకిచ్చారు. జేఏసీ ఇచ్చిన విరమన లేఖను తిరిగి వెనక్కు పంపించారు. కార్మికులను ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇష్టం వచ్చినప్పుడు సమ్మెకు వెళ్లి.. ఇష్టం వచ్చినప్పుడు విధుల్లోకి చేరుతామంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. వారంతట వారే సమ్మెకు వెళ్లి.. ఇప్పడు విధుల్లో చేరుతామని ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు సునీల్‌ శర్మ

ఇంత జరిగిన తరువాత కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పండగ రోజుల్లో అనాలోచితంగా సమ్మె చేశారని.. ఇప్పుడు తాము ఎలా విధుల్లోకి తీసుకుంటామన్నారు. హైకోర్టు సూచనల మేరకు లేబర్‌ కమిషనర్‌ తీర్పు వచ్చేంత వరకు కార్మికులు ఎదరుచూడాలని సునీల్‌ శర్మ సూచించారు. విధుల్లోకి చేరుతామంటూ డిపోల దగ్గర శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమన్నారు. తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగులను అడ్డుకుని.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్మికులను హెచ్చరించారు. అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story