రాజ్యాంగానికి 70 వసంతాలు

రాజ్యాంగానికి 70 ఏళ్లైన ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
భారతావనికి దశ, దిశ నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 వసంతాలు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ ప్రారంభిస్తారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి ప్రజలకు తెలియజేసేందుకు మంగళవారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com