'మహా' రాజకీయం.. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా!

మహా రాజకీయం.. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా!
X

ajith-pawar

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు గంటగంటకూ మారుతున్నాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్నీ ఎన్సీపీ, శివసేన వెల్లడించింది. అలాగే సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తరువాత శివసేన పార్టీ బేరసారాలకు దిగిందని ఆరోపించారు. ఎన్నికల ముందు పొత్తుపెట్టుకొని ఫలితాల తరువాత బీజేపీని శివసేనను మోసం చేసిందన్నారు. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా శివసేన వ్యవహరించిందని అన్నారు. సీఎం పదవికోసం శివసేన సిద్ధాంతాలను తుంగలో తొక్కిందని అన్నారు. అటు బీజేపీ ఆట ముగిసిందని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యానించారు. అజిత్‌ పవార్‌ వెంట వెళ్లిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు అందరూ తిరిగొచ్చారని ఆయన చెప్పారు.

Tags

Next Story