కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర గవర్నర్‌

కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర గవర్నర్‌
X

kalidas

మహారాష్ట్రలో క్షణానికోరకంగా రాజకీయాలు మారుతున్నాయి. సీఎం ఫడ్నవిస్‌ రాజీనామా అనంతరం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. బుధవారమే ఎమ్మెల్యేలందరు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు

అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది.

అసెంబ్లీ ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్‌ శాసనసభ్యుడు కాళిదాస్‌ కోలంబకర్‌ నియమితులయ్యారు. ఇదిలావుంటే ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి సిద్ధమవుతోంది. సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్దవ్‌ ఠాక్రేను ఎన్నుకునేందుకు మూడు పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని కూటమి నేతలు భావిస్తున్నారు.

Tags

Next Story