ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ : సీఎం జగన్

ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ : సీఎం జగన్
X

cm-jagan

ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథాకాలు అందేలా పారదర్శకత పాలన అందిస్తామన్నారు ఏపీ జగన్‌. స్పందన కార్యక్రమంపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను డిసెంబర్ 15 నుంచి 18 వరకు గ్రామ సచివాలయంలో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయం అనుబంధంగా ఏర్పాటుచేస్తున్న వర్క్‌షాపుల ఏర్పాటును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

రైతు భరోసా కింద 45 లక్షల 83 వేల మందికి రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని మిగతా వారికి వారం రోజుల్లోగా చెల్లించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ధాన్యం సేకరణ, రైతులకు చెల్లింపుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం కింద రోజుకు 225 రూపాయలు చొప్పున ఆసుపత్రి నుంచి డిశార్చ్‌ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లో జమ చేయాలని సూచించారు...

డిసెంబర్‌ 21 నుంచి చేనేత కుటుంబానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 24వేలు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు . ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని చెప్పారు. మార్చి నాటికి లబ్దిదార్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జనవరి 1 నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని తెలిపారు.

ఇసుక ధరలు లభ్యతపై జిల్లా స్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమాలు అరికట్టేందుకు ప్రతి వాహనానికి జీపీఎస్‌ తప్పనిసరి అని సీఎం ఆదేశించారు. అటు సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టడంపై ఎస్పీలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో అవినీతి పరుల భరతం పట్టేలా చర్యలుండాలన్నారు సీఎం జగన్‌.

Tags

Next Story