జనసేనాని రాయలసీమ పర్యటన ఖరారు..

రాయలసీమ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టూర్ ఖరారైంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి
ఆరు రోజులు పాటు రాయలసీమలో పర్యటించనున్నారు. చిత్తూరు, కడప జిల్లాలో పవన్ పర్యటన కొనసాగుతోంది. డిసెంబర్ 1న రేణిగుంట విమానాశ్రమానికి చేరుకుని అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. రైల్వే కోడూరూలో కడప జిల్లా రైతుల సమస్యలపై చర్చిస్తారు. జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు..
డిసెంబర్ 2న తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతోనూ, 3న కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతోనూ, 4న మదనపల్లి, 5న అనంతపురం జిల్లా నేతలతో సమావేశమవుతారు. 6న పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేననేతలతో సమావేశమే.. వైసీపీ నేతల వేధింపులపై చర్చిస్తారు. వైసీపీ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com