ఈ రోగాలుంటే కువైట్‌లో ఉండడం కుదరదు..

ఈ రోగాలుంటే కువైట్‌లో ఉండడం కుదరదు..

kuwait

మీకు వైద్యం చేయించాలంటే మాకు బోల్డంత ఖర్చవుతోంది. అందుకే ఎందుకొచ్చిన గొడవ. మీ దేశంలో మీరు చావండి.. మా దేశం వచ్చారో వైద్యం అందక ఛస్తారు. ఇప్పటికే టీబీ, హెపటైటిస్ బీ అండ్ సీ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు కలిగి ఉన్న ప్రవాసులు కువైట్‌లో ఉద్యోగం చేయడానిక్కానీ, ఉండడానిక్కానీ వీల్లేదని గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా ఆ జాబితాలోకి డయాబెటిస్‌ని కూడా చేర్చారు. వీటితో పాటు మరికొన్ని వ్యాధులను కూడా చేర్చారు కానీ వాటిని ఇప్పుడే బయటపెట్టమని డాక్టర్ ప్రహ్లాద్ వివరించారు. అధికారికంగా నిర్ధారించిన తరువాత ఆ వ్యాధుల పేర్లు ప్రకటిస్తామన్నారు. అయితే అనీమియా వంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాధులను జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

Read MoreRead Less
Next Story