2021 జూన్ నాటికి పోలవరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం పూర్తిచేస్తాం : మంత్రి అనిల్

X
By - TV5 Telugu |26 Nov 2019 5:46 PM IST
పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే, స్పిల్ ఛానెల్, కాపర్ డ్యాం నిర్మాణాలను పరిశీలించారు మంత్రి అనిల్ కుమార్. కాంక్రీట్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారులతో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్‌కుమార్... రివర్స్ టెండరింగ్‌తో 800 కోట్లు ఆదాయచేశామన్నారు. చెప్పినట్లుగానే నవంబర్ ఒకటి నుంచి ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టామన్నారు. స్పిల్‌వేలో 2 లక్షల17వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సి ఉందన్న ఆయన.. గేట్ల ఫాబ్రికేషన్ వర్క్ 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. 2021 జూన్ నాటికి ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com