మహారాష్ట్ర కేసులో సుప్రీం రిఫర్ చేసిన కేసులు ఇవే..

మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బుధవారమే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని రూలింగ్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా త్రిసభ్య ధర్మాసనం గతంలో పలు కేసులను పరిశీలించింది. వాటిని రిఫర్ చేస్తూ తీర్పు వెల్లడించింది. 1994 నాటి ఎస్.ఆర్.బొమ్మై కేసుతో పాటు.. 1998లో యూపీ జగదాంబికాపాల్ కేసును రిఫర్ చేసింది. 2005లో జార్ఖండ్, 2016లో ఉత్తరాఖండ్, 2017లో గోవా, 2018లో కర్నాటక కేసులను కూడా సుప్రీం ప్రస్తావించింది.
1994కు ముందు గవర్నర్ల కమిటీ ఇచ్చిన నివేదిక, సర్కారియా, రాజ్ మన్నార్ కమిటీలను రిఫర్ చేసిన ధర్మాసనం.. బలనిరూపణ రాజ్ భవన్ లో కాదు.. అసెంబ్లీలో జరగాలని స్పష్టం చేసింది. అన్ని కేసుల్లో కూడా రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఖచ్చితంగా ఫ్లోర్ టెస్ట్ సాధ్యమైనంత త్వరగా జరగాలని సూచిస్తున్నాయని.. కోర్టు తెలిపింది. ఇప్పుడు ఈ కేసులో కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ సంక్షోభం ఉన్నసమయంలో ఫ్లోర్ టెస్ట్ ద్వారా బలనిరూపణ చేసుకుని.. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. గవర్నర్ అధికారాలను కూడా పరిశీలించిన ధర్మాసనం.. మహారాష్ట్రలో ఫ్టోర్ టెస్ట్ ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com