టీవీ5 ఛానెల్ ప్రసారాల పునరుద్ధరణలో అలసత్వం.. ఏపీ ఫైబర్‌నెట్‌కు భారీ పెనాల్టీ

ఏపీ ఫైబర్‌నెట్‌కు మరో షాక్ తగిలింది. తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు టీడీశాట్ భారీ పెనాల్టీ విధించింది. 43లక్షల రూపాయలు వెంటనే జమ చేయాలని ఏపీ ఫైబర్‌నెట్‌ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో టీవీ5 ప్రసారాల నిలిపివేతకు సంబంధించిన కేసులో.. గతంలోనే ఏపీ ఫైబర్‌నెట్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా టీవీ5 ఛానెల్ ప్రసారాల పునరుద్ధరణలో అలసత్వం వహించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పెనాల్టీ విధించింది టీడీశాట్. ఈ కేసులో ఇప్పటికే 5 లక్షల రూపాయల పెనాల్టీ జమ చేసిన ఏపీ ఫైబర్‌నెట్.. మిగతా 38 లక్షలు తక్షణం కట్టాలని టీడీశాట్ ఆదేశించింది.
ఏపీ ఫైబర్‌నెట్ సెప్టెంబర్ 13న టీవీ5 న్యూస్ ఛానల్ ప్రసారాలను నిలిపేసింది. దీనిపై టీడీశాట్‌ను ఆశ్రయించగా.. అక్టోబర్ 1న తీర్పు వచ్చింది. ఏపీ ఫైబర్‌నెట్‌కు 5 లక్షల రూపాయల పెనాల్టీ విధించింది టీడీశాట్. టీవీ5 ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించింది. అలా చేయకుంటే.. రోజుకు 2 లక్షల రూపాయల పెనాల్టీ తప్పదని హెచ్చరించింది. అయితే.. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఏపీ ఫైబర్‌నెట్ అధికారులు అలసత్వం వహించారు. 19 రోజులు ఆలస్యంగా టీవీ5 ప్రసారాలను పునరుద్ధరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన టీడీశాట్.. మరో 38 లక్షల పెనాల్టీ జమ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవాలకు ప్రతిరూపంగా నిలిచే టీవీ5 న్యూస్ ఛానల్ సాధించిన మరో అద్భుత విజయమిది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్ట వ్యతిరేక చర్యపై టీడీశాట్‌లో సవాల్ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. అధికార దుర్వినియోగంపై విజయం సాధించింది టీవీ5 న్యూస్ ఛానల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com