శబరిమల ఆలయ ప్రవేశం చేసి తీరుతా: తృప్తి దేశాయ్

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లితీరతామంటున్నారు మహిళా సంఘం నాయకురాలు తృప్తి దేశాయ్. రాజ్యాంగం తమకు కల్పించిన సమానత్వ హక్కుతో పాటు.. సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కేరళలోని కొచ్చి నగరానికి చేరుకున్న తృప్తి దేశాయ్ బుధవారం శబరిమలకు చేరుకుంటారు. ప్రభుత్వాన్ని, పోలీసులను భద్రత ఇవ్వాలని అడుగుతున్నట్టు చెప్పారు. రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా.. ఆలయప్రవేశం చేసి తీరుతామంటున్నారు తృప్తిదేశాయ్.
తృప్తి దేశాయ్ ఇప్పటికే ఆలయంలో అడుగుపెడతామని.. దర్శనం చేసుకోకుండా వెళ్లేది లేదని ప్రకటించడంతో పోలీసులు భద్రతను పెంచారు. భక్తులకు వారికి మధ్య ఘర్షణలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మహిళలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని భక్తులు చెబుతున్నారు. వస్తే అడ్డుకుని తీరుతామంటున్నారు. దీంతో ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. అడుగగుడునా తనిఖీలు చేసిన తర్వాతే భక్తులను అనుమతిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com