ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు

ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు

ww

52రోజుల సుదీర్ఘ ఆందోళనల అనంతరం ఆర్టీసీ సమ్మె ముగించినట్టు జేఏసీ నేతలు ప్రకటించడంతో కార్మికులు ఉదయమే డిపోల వద్దకు చేరుకుంటున్నారు. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు పెద్ద ఎత్తున డిపోల వద్దకు వచ్చారు. అధికారుల సమాచారంతో ముందుగానే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది. డిపోలకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి లేదని.. వచ్చిన కార్మికులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు.

ప్రతిడిపోకు ఓ డీఎస్పీ స్థాయి అధికారిని భద్రతకోసం పెట్టారు. సాయుధ బలగాలను మోహరించారు. బారీకెడ్లు పెట్టారు. తాత్కాలిక సిబ్బందికి ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు డిపోల వద్ద సోమవారం రాత్రి నుంచే జేఏసీ నాయకులను అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన మహిళా కార్మికులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇతర డిపోల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ డిపోవద్ద పోలీసులకు, కార్మికులకు వాగ్వాదం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు.. ఖమ్మం జిల్లాలో డిపోల వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్టు చేసి.. స్టేషన్ లకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story