విశాఖ ఉత్సవ్‌కు ముహూర్తం ఫిక్స్

విశాఖ ఉత్సవ్‌కు ముహూర్తం ఫిక్స్
X

vsp.png

విశాఖ ఉత్సవ్‌కు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 28, 29 తేదీల్లో రెండ్రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గతంలో మూడు రోజులపాటు ఉత్సవ్‌ నిర్వహించేవారు. అయితే, ఈసారి రెండ్రోజులే నిర్వహిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా ఈసారి అందరూ మెచ్చుకునే విధంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎప్పటిలాగే ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వేడుకుల సందర్భంగా ఎప్పుడూ స్థానిక కళాకారులు అసంతృప్తి వ్యక్తం చేసేవారని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా స్థానిక కళాకారులకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సెంట్రల్‌ పార్క్‌లో ఏర్పాటు చేయనున్న ఫ్లవర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Tags

Next Story