పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి
X

baby

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. మసీదు బండ గ్రామంలో పదేళ్ల నాగేశ్వరి అనే బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన మొగులయ్య, పద్మ దంపతుల కుమార్తె నాగేశ్వరి. మంగళవారం సాయంత్రం నుంచి తమ కుమార్తె కనబడటంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాలిక శవమై తేలింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 24 నాలుగు క్రితం తమ ముందు ఆడుతూపాడుతూ ఉన్న బాలిక మృత్యువాతపడిన ఘటనతో తల్లిదండ్రులు, స్థానికులు షాకయ్యారు.

Tags

Next Story