పాపం జింక.. పొట్టనిండా ప్లాస్టిక్..

పాపం జింక.. పొట్టనిండా ప్లాస్టిక్..

deer

చెంగు చెంగున అడవిలో తిరిగే జింకలు ఆకులు, అలములు తిని బతుకుతుంటాయి. వాటి మానాన వాటిని బతకనివ్వకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు అడవులను కూడా నాశనం చేస్తూ.. అడవుల్లో సంచరిస్తున్న మూగ జీవుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హాని కలిగిస్తుందని నెత్తీ నోరు మొత్తుకున్నా మానవుని జీవితంలో మమేకమైపోయిన ప్లాస్టిక్ లేందేం రోజు గడవడం కష్టమైపోయింది. ప్రభుత్వాలే చర్యలు తీసుకుని ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధిస్తే తప్ప ప్రజలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేరు. వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లు తిని నోరులేని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఆ వార్త చదివి మనం కూడా అయ్యో అంటున్నామే తప్పించి షాపు వాడు కవర్ ఇవ్వకపోతే.. ఎలా పట్టుకెళ్లాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నాము. సరుకులకో సంచిని క్యారీ చేయడం ఎప్పుడో మర్చిపోయాం. ఉత్తర నాన్ ప్రావిన్స్‌లోని ఖున్ సతాన్ నేషనల్ పార్కులోని జింక మరణించింది. చెంగు చెంగున ఎగిరే జింక సడెన్‌గా ప్రాణాలు కోల్పోయేసరికి అటవీ శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. జింకను పరీక్ష చేసి దాని కడుపులో 7 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు. జింక పొట్టలో నుంచి తీసిన వ్యర్ధాల్లో కాఫీ, నూడుల్స్ ప్యాక్‌లు, ప్లాస్టిక్ తాడు, రబ్బర్ గ్లౌవ్స్, హ్యాండ్ కర్చీఫ్‌తో పాటు ఇతర ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ పొట్టలో పేరుకు పోవడంతో అరగక పోవడం వల్లే జింక చనిపోయిందని అధికారులు అంటున్నారు.

Read MoreRead Less
Next Story