లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా వీఆర్వో

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా వీఆర్వో
X

Screenshot_1

నెల్లూరు జిల్లా వరిగొండలో 3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కింది ఓ మహిళా వీఆర్వో. నెల్లూరు నగరానికి చెందిన లోకేష్‌ అనే వ్యక్తికి.. వరిగొండలో 9సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ స్థలానికి సంబంధించిన పాస్‌ బుక్‌లో పేరు మార్పిడి కోసం దర్యాప్తు చేసుకున్నాడు. ఇందుకోసం 5వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన వీఆర్వో లావణ్య. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.. రంగంలోకి దిగిన అధికారులు లావణ్య.. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Tags

Next Story