తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రమాదం

తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో తెలంగాణలో రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌-దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రధాన రహదారిపై తృటిలో ప్రమాదం తప్పింది. బస్‌స్టాప్‌లో ఆగి ఉన్న ఓ ఆర్టీసీ బస్సును.. మరో అర్టీసీ బస్సు వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. అయితే తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.. అతి వేగంగా వస్తుండడంతో డ్రైవర్‌ అదుపు తప్పి ముందున్న బస్సును ఢీ కొట్టాడని స్థానికులు చెబుతున్నారు.. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు మలక్‌పేట్‌ పోలీసులు..

కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.. హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా మరో ప్రమాదం జరిగింది.. ఇప్పుడు ఆర్టీసీ బస్సును చూస్తేనే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story