ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ : ఏపీ కేబినెట్‌

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ : ఏపీ కేబినెట్‌
X

ap-cabinate

పేదలు అందరికీ ఇళ్లు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ మంత్రిమండలి ఆమోదించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన దాదాపు 3గంటల పాటు ఈ భేటీ కొనసాగింది.

కాపు మహిళలకు ఆర్థిక సాయం అందించే కాపు నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కాపు మహిళలకు ఆర్థిక సాయం అందించనున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంచడంతోపాటు పలు సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.. రాజధానికి సరైన రోడ్లు వేయని ఆయన ఇప్పుడు ఎందుకు రాజధానిలో పర్యటిస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.

Tags

Next Story