మంత్రులకు ఎంత అహంకారం : చంద్రబాబు

మంత్రులకు ఎంత అహంకారం : చంద్రబాబు
X

chandrababu

సీఎం సొంత జిల్లా కడపలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయన్నారు అధినేత చంద్రబాబు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఆర్థిక, భౌతిక దాడులు తీవ్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆరోపించారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. వైసీపీ దాడుల్లో గాయపడ్డ పలువురు టీడీపీ నాయకులను పరామర్శించారు.

ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రులకు ఎంత అహంకారమని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో ఏం జరుగుతుంతో ప్రపంచానికి తెలియాలి అనే తాను రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నాను అన్నారు. ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తోందని, ఏపీ విశ్వసనీయతు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story