అంతర్జాతీయం

అమెరికా వైట్‌హౌస్‌లో అరుదైన సత్కారం అందుకున్న శునకం

అమెరికా వైట్‌హౌస్‌లో అరుదైన సత్కారం అందుకున్న శునకం
X

white-house

ఐసిస్ చీఫ్ అబు బాకర్ అల్ బగ్దాదిని అంతమొందించడంలో కీలక పాత్రపోషించిన ఆర్మీ శునకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొనియాడారు. బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ శునకం అంటూదాన్ని అభివర్ణించాడు. గతనెల 26న అల్ బాగ్దాదిని హతమార్చడంలో బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన జాగిలం గాయపడింది. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఆ శునకాన్ని అధికారులు అధ్యక్షభవనం వైట్ హౌజ్ కు తీసుకొచ్చారు. ట్రంప్ దంపతులు, ఉపాధ్యక్షుడితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ట్రంప్.. ఆ శునకం సాహాసాన్ని మెచ్చుకున్నారు. ఇది ఎంతో నమ్మకమైందని, తెలివైందని కొనియాడారు.

Next Story

RELATED STORIES