ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్.. భారీ తగ్గింపు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' సరికొత్త షాపింగ్ ఫస్ట్ ను ప్రారంభించింది. ఈసారి 'బిగ్ షాపింగ్ డేస్' తో ముందుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ప్రారంభమై డిసెంబర్ 5 (గురువారం)తో ముగుస్తుంది. కేవలం ఐదు రోజుల షాపింగ్ సందర్బంగా పలు రకాల స్మార్ట్ ఫోన్లను భారీ డిస్కౌంట్ ధరలకు అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ తోపాటు.. హెచ్‌డిఎఫ్‌సి EMI లావాదేవీలపై కూడా వర్తింపజేసింది. టీవీలు, గృహ ఉపకరణాలపై 75 శాతం, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం తగ్గింపు ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. బిగ్ షాపింగ్ రోజులలో మొబైల్ కొనుగోళ్లలో, ఫ్లిప్‌కార్ట్ నో కాస్ట్ EMI, కార్డ్‌లెస్ క్రెడిట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది.
రియల్‌మే 5 ప్రో బేసిక్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ .12,999 కు లభిస్తుంది.
ప్రీపెయిడ్ లావాదేవీలపై రూ .1000 మినహాయింపుతో రియల్‌మే ఎక్స్ రూ .14,999 కు లభిస్తుంది. దీని ఒరిజినల్ ప్రైజ్ రూ.16,999 గా ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 30 అసలు ధర రూ .16,999 అయితే ఈ షాపింగ్ సమయంలో రూ .15,999 మాత్రమే లభించనుంది. అంతేకాదు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ .2,000 అదనపు ఆఫర్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 9 + బేసిక్ 64 జిబి మోడల్ అసలు ధర రూ .64,900 ఉండగా ఇది కేవలం రూ .34,999 కు మాత్రమే లభిస్తుంది. ఇది మార్చి 2018 లో మార్కెట్లోకి వచ్చింది.
మొబైల్ ఫోన్లపై ఆఫర్లు
రియల్‌మి5 : అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999
రియల్‌మి ఎక్స్: అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 : అసలు ధర రూ. 29,999 డిస్కౌంట్ ధర రూ. 27,999
గెలాక్సీ ఎస్ 9 ప్లస్ : అసలు ధర రూ. 37,999 డిస్కౌంట్ ధర రూ. 34,999
గూగుల్ పిక్సెల్ 3 ఎ : అసలు ధర రూ. 34,999 ఆఫర్ ధర రూ. 29,999
ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్ ధర రూ. 24,999
ఆసుస్ 5 జెడ్ : అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com