అతడి శరీరంలో రెండు జలగలు.. డాక్టర్లు షాక్

అతడి శరీరంలో రెండు జలగలు.. డాక్టర్లు షాక్

leech

కడుపులో నులిపురుగులు తెలుసుకానీ, కంట్లో ఏలికపాములు, ముక్కులో జలగలు.. బాబోయ్ వినడానికే వింతగా అనిపిస్తున్నా.. పాపం వాటిని ఎలా భరించారో ఆ వ్యక్తులు. దగ్గు, జలుబుతో తీవ్రంగా బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు ఆయాసపడుతూ. అతడికి బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించిన వైద్యులు గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. ఈ ఘటన చైనాలోని ప్యూజిన్ ప్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యులు అతడికి ముందు సిటీ స్కాన్ చేసినా సమస్యను గుర్తించలేకపోయారు.

బ్రాంకోస్కోపీ ద్వారా అతడి ముక్కులో ఉన్న జలగను గుర్తించారు. గొంతు, ముక్కు భాగాల్లోంచి తీసిన జలగలు ఒక్కొక్కటి 1.2 అంగుళాల సైజు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అలా ఎలా జలగలు ముక్కులోకి, గొంతులోకి వెళ్లాయని డాక్టర్లను ప్రశ్నిస్తే.. ఇంతకుముందు అతడు ఎక్కడైనా నీటిని తాగి ఉండవచ్చని, ఆ నీటిలో ఉన్న సూక్ష్మ క్రిములతో పాటు జలగలు కూడా గొంతులోకి, ముక్కులోకి వెళ్లిపోయి ఉంటాయని డాక్టర్లు వివరించారు. రెండు నెలలుగా అతడు బాధపడుతున్నా సరైన వైద్య పర్యవేక్షణ జరగనందున ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. రెండు నెలలుగా అతడి శరీరంలో ఉన్న జలగలు రక్తాన్ని పీల్చి అతడిని అనారోగ్యానికి గురి చేశాయి.

Read MoreRead Less
Next Story