హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు.. జీతం రూ.40,000

వైజాగ్‌లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు.. ఆపరేషన్ టెక్నీషియన్: 66.. బాయిలర్ టెక్నీషియన్ 06
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది.
విద్యార్హత: కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
రాత పరీక్షవిధానం: జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. దేశవ్యాప్తంగా 5 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ముంబయి, విశాఖపట్నం, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500. SC,ST అభ్యర్ధులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రారంభం: నవంబరు 22, 2019, దరఖాస్తు చివరితేదీ: డిసెంబర్ 21, 2019.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com