వర్మ సినిమా.. గురువారం ఏం జరగబోతోంది..!

వర్మ సినిమా.. గురువారం ఏం జరగబోతోంది..!

krkr

కాంట్రవర్సీ అంటే రామ్‌గోపాల్ వర్మ! రామ్‌గోపాల్‌ వర్మ అంటే కాంట్రవర్సీ! సినిమా అంటే పడి చచ్చే RGV... అదే సినిమాకు తన పైత్యాన్ని కూడా జోడించి జనాలపైకి వదులుతుంటారు. అలా వర్మ తన అమ్ములపొదిలోంచి వదిలిన మరో బాణమే కమ్మరాజ్యంలో కడప రెడ్లు. అసలు ఈ టైటిలే ఓ పెద్ద వివాదం. అందులోని నటీనటులు, దృశ్యాలు, డైలాగులపై పెద్ద రచ్చ జరిగింది. ఇంకా జరుగుతోంది. ట్రైలర్ చూసినా.. పాటలు విన్నా వర్మ ఎంత సెటైరికల్‌గా ఈ సినిమా తీశాడో ఇట్టే అర్థమైపోతోంది. ఏపీ రాజకీయాలను బేస్‌ చేసుకొని ఈ సినిమా తీసినట్లు చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ వర్మ మాత్రం ఒప్పుకోవడం లేదు.! పైగా తన సినిమా ఓ సందేశాత్మక చిత్రం అని చెబుతున్నాడు.

అటు ఈ వివాదం ఇప్పటికే హైకోర్టుకు చేరింది. ట్రైలర్‌లో తనను కించపర్చేలా చూపించారని పిటిషనర్‌ కేఏపాల్ కోర్టుకు తెలిపారు. సెన్సార్‌ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశించాలని.. చిత్రం విడుదల కాకుండా స్టే విధించాలని కోరారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి కించపరిచేలా చిత్రం తీశారని ఆరోపించారు. అందుకు తగ్గ ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఐతే.. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని.. ఈ చిత్రంపై రివ్యూ నడుస్తోందని చిత్ర యూనిట్‌ కోర్టుకు తెలిపింది. గురువారం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం పూర్తి వివరాలు ఇవ్వలన్న హైకోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story