'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' : వర్మ సినిమా పేరు మార్పు..!

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు : వర్మ సినిమా పేరు మార్పు..!

Fall-of-maverick-director-RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజును ఆపాల్సిందిగా మతప్రబోధకుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ పై ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు ఈ సినిమా టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా పేరు మార్చాల్సి వస్తే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే టైటిల్ పెడతానని వర్మ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story