తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక

తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక
X

rahulఆర్ధిక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వెళ్లి కలిశారు. ఎయిల్ సెల్ - మాక్సీస్ కేసులో ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. రెండునెలలుగా చిదంబరం రిమాండులో ఉన్నారు. సీబీఐ కేసులో బెయిలు వచ్చినా.. ఈడీ కేసులో ఇంకా బెయిలు రావాల్సి ఉంది. గతంలో ఒకసారి సోనియాగాంధీ వచ్చి చిదంబరాన్ని కలిశారు. తాజాగా ప్రియాంకతో కలిసి వచ్చిన రాహుల్ చిదంబరంతో తాజా రాజకీయాలపై చర్చించారు.

Tags

Next Story