ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
X

ap-cabinate

ఏపీ సిఎం జగన్మోహన రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేశారు. గతంలో అమలవుతున్న పథకాల పరిధిని తగ్గిస్తూ ప్రతి పథకానికి వేర్వేరు కార్డులు ఇవ్వాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పేదలకు వైద్య చికిత్సల కోసం ఆరోగ్యశ్రీకార్డులు, రేషన్ సరకుల కోసం బియ్యం కార్డులను జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. హాస్టళ్లలో సౌకర్యాల మెరుగు కోసం జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కింద ఏడాదికి మొత్తం 5700 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపు మహిళలకు ఆర్ధిక సాయం నికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతీ మహిళకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున 75 వేల ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 1101 కోట్ల రూపాయల వ్యయం చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీపీఎస్ రద్దు పై ఏర్పాటు చేసిన మంత్రుల కమీటీ కి సహాయంగా ఉండేందుకు అధికారుల కమిటీకీ మంత్రివర్గం ఆమోదం తెలియచేసింది.

పేదలందరికీ ఇళ్లు పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉగాదికి 25 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ కు డిసెంబరు 26 తేదీన శంకుస్థాపన చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 కి పెంచుతూ దేవాదాయశాఖ చట్టంలో సవరణల కోసం తీసుకున్న నిర్ణయానికీ కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనపైనా కేబినెట్ ఆమోదం తెలిపింది.

గిరిజన ప్రాంతాల్లో ఆశా వర్కర్లకు గౌరవవేతనాన్ని 400 నుంచి 4 వేలకు పెంచిన గత కేబినెట్ దీని కోసం అదనంగా చెల్లించాల్సిన 14.46 కోట్ల నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్త ఏపీఎస్పీడీసిఎల్ నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను వేరు చేసి ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. మరోసారి జగన్‌ తన సంక్షేమ మార్కును కొనసాగిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Tags

Next Story