ఆర్టీసీ కార్మికుల నిరసన.. ఉద్రిక్తత

X

విధుల్లో చేరతామంటున్నా.. అధికారులు అనుమతించకపోవడంతో TSRTC కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు, CPM నాయకులతో కలిసి నల్గొండ కలెక్టరేట్ ముట్టడిచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం తక్షణమే తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు.
కార్మికులు, CPM నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. CPM రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా CPM కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
