ఫిల్మ్‌నగర్‌లో రూ.15 కోట్లు పెట్టి కామ్రెడ్..

ఫిల్మ్‌నగర్‌లో రూ.15 కోట్లు పెట్టి కామ్రెడ్..

vijay

అర్జున్ రెడ్డితో హిట్ కొట్టి.. ఆ తరువాత వచ్చిన ఒకటీ, రెండు సినిమాలు ఫెయిల్ అయినా సక్సెస్ హీరోగానే కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. మీకు మాత్రమే చెప్తాతో నిర్మాతగా మారిన విజయ్ ఓ ఇంటివాడయ్యాడు. గతంలోనే ఓ ఇల్లు కొన్నా.. ఇప్పుడు మళ్లీ రూ.15కోట్లు పెట్టి ఫిల్మ్‌నగర్‌లో ఇల్లు కొన్నాడు. ఆ ఇంట్లో అమ్మా, నాన్న, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మరో సినిమా పూరీ జగన్నాథ్ డైరక్షన్‌‌లో ఫైటర్. ఇది జనవరి నుంచి సెట్స్‌పైకి వెళుతుంది.

Read MoreRead Less
Next Story