బిగ్ బీ షాకింగ్ డెసిషన్.. మనాలీ వెళ్తూ ..

బిగ్ బీ షాకింగ్ డెసిషన్.. మనాలీ వెళ్తూ ..
X

Big-B

ఎవరెన్ని చెప్పినా వినిపించుకోం. మన మనసు మాటకే ఓకే చెప్తాం. ఇందుకు బాలీవుడ్ బిగ్ బీ కూడా అతీతులు కారు. వయసు మీద పడుతోంది. ఆరోగ్యం ఇది వరకటిలా లేదు. రిస్క్ తీసుకోవద్దు అని డాక్టర్లు వార్నింగ్ ఇచ్చినా వినిపించుకోలేదు. వరుస షూటింగులతో బిజీగా ఉంటున్నారు. మొన్నామధ్య అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో ఉండి వైద్యం తీసుకున్నారు. ఆయనను డిశ్చార్జ్ చేసే ముందు డాక్టర్లు షూటింగ్స్‌‌కి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ నిమిత్తం మనాలీ వెళ్లారు.

అయిదు దశాబ్దాలుగా చిత్ర రంగాన్ని ఏలిన ఆయనకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే బోర్. వెండి తెరపైనో, బుల్లి తెరపైనో బిజీగా గడిపేస్తుంటారు. అందులోనే ఆనందం, ఆరోగ్యం ఉంటుందని అనుకున్నారు. కానీ కారులో మనాలీ నుంచి షూటింగ్ స్పాట్‌కు వెళుతుంటే ఎందుకో అనిపించిందట. అలసిపోయిన శరీరానికి కాస్త రెస్ట్ ఇవ్వాలని. ఇక నేను రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని బాడీ చెబుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం అమితాబ్ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేసి ఆ తరువాత సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు.

Next Story