పుట్టినరోజే చివరి రోజు ...19 ఏళ్ల యువతిపై రేప్ ?

పుట్టినరోజే చివరి రోజు ...19 ఏళ్ల యువతిపై రేప్ ?

yvathi

మళ్లీ మళ్లీ ఎన్నో పుట్టిన రోజులు హ్యపీగా జరుపుకోవాల్సిన ఓ యువతిని కామాంధుడు కాటేశాడు.. వరంగల్‌ రూరల్‌ హ్మనకొండలో ఈ దారుణం జరిగింది. పుట్టిన రోజు కాబట్టి గుడికి వెళ్లి, అట్నుంచి స్నేహితుల్ని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి.. తిరిగి రాకపోవడంతో తల్లి దండ్రులు తల్లడిల్లారు..

తమ కూతురి జాడ కోసం వెతుకున్న తల్లిదండ్రులకు రాత్రి పూట విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో శవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు షాకైపోయారు. జరిగిన ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా రోధించారు.

ఆమె డెడ్‌బాడీకి సమీపంలోనే బీరు బాటిళ్లు ఉండడం గుర్తించిన పోలీసులు ఇతర క్లూస్ ఆధారంగా దర్యాప్తు మొదలెట్టి గంటలోపే కేసును పోలీసులు చేధించారు..

నిందితుడు సాయిగౌడ్‌ మృతురాలు మానసకు కొన్ని నెలల కిందటే పరిచయం అయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. కాలేజ్‌లో కలుసుకోవడం.. తరువాత ఫోన్‌లో మాట్లాడుకోవాడినికే ఆ పరిచయం పరిమతమైంది. అయితే పుట్టిన రోజు సందర్భంగా మానసను కలిసేందుకు సాయి కుమార్‌ ప్రయత్నించాడు. దీంతో ఆమె భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి.. మధ్యాహ్నం బయటకు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెను తన కారులో చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు సాయి కుమార్. ఆమె ఒంటరిగా ఉండడంతో తనలోని మృగాన్ని పైకి లేపాడు. మానసను బలవంతంగా అనుభవించి.. బయటకు చెబుతుందనే భయంతో హత్య చేశాడు.

మానస మరణించడంతో ఈ హత్యనేరం తనపై రాకుండా వుండేందుకు, ఆమె శవాన్ని తరలించేందుకు తన మిత్రులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న నిందితుడి మిత్రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే శవాన్ని చూసి భయపడి అక్కడి నుంచి వారిద్దరూ వెనక్కు వెళ్లిపోయారు.

ఎవరు సహాయం చేయకపోవడంతో నిందితుడు.. ఒంటరిగానే మానస మృతదేహాన్ని కారులో వేసుకుని చీకటి అయ్యే వరకు నిర్మాణుష్య ప్రాంతం కోసం వెతికి.. చివరికి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఓ బట్టల షాపుకు వెళ్లి.. కొత్త బట్టలు కొని... ఆమె మతదేహంపై ఉన్న రక్తాన్ని తుడిచి.. కొత్త బట్టలు వేసి.. తరువాత హంటర్ రోడ్ లోని విష్ణుప్రియ గార్డెన్స్ పరిశరాల్లో నిర్మాణుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి.. ఏం తెలియనట్టు తన ఇంటికి వెళ్లిపోయాడు.

మానస అన్నయ్య గాదం శ్రీనివాస్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డెడ్ బాడీ దగ్గర దొరికిన క్లూస్ సహకారంతో గంటలోనే నిందుతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిజంగా ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక స్నేహితులతో కలిసి దుర్మార్గానికి ఒడిగట్టాడా అన్న కోణంలో విచారణను కొనసాగిస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఆధారాలు చూస్తే... గ్యాంగ్‌ రేప్‌ అయి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story