చరిత్ర సృష్టించిన ఉద్ధవ్‌ ఠాక్రే

చరిత్ర సృష్టించిన ఉద్ధవ్‌ ఠాక్రే
X

Uddhav-Thackeray

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పదవిని చేపట్టిన తొలివ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు. ఉద్ధవ్‌తో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ ముండే, సుభాష్‌ దేశాయ్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, నితిన్‌​ కేత్‌లు ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలరోజుల నిరీక్షణ తరువాత మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలుతీరింది.

Tags

Next Story