విదేశీ విద్యార్ధులను అరెస్టు చేసిన అమెరికా

విదేశీ విద్యార్ధులను అరెస్టు చేసిన అమెరికా

us

ఫేక్ యూనివర్సిటీ కేసులో అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మరో 90మంది విదేశీ విద్యార్ధులను అరెస్టుచేశారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్దంగా దేశంలో అక్రమంగా ఉన్న కారణంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయ విద్యార్ధులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీసా గడువు ముగిసినా.. దేశంలో ఉన్న విద్యార్ధులను పట్టుకునేందుకు హోల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మూతపడిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. దాదాపు 6వందల మంది విదేశీ విద్యార్ధులు ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ గత మార్చిలో 250మందిని అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరికి ఈ మధ్యనే జైలు శిక్షకూడా పడింది.

ఫేక్ యూనివర్సిటీలో చేసిన చాలా మంది విద్యార్ధులు స్వచ్చందంగా దేశం విడిచి వెళ్లిపోతున్నారని.. కొంత మంది మాత్రం ఇక్కడ ఉన్నారని ఇమ్మిగ్రేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక్కడ ఉన్నవాళ్లలను మాత్రమే అరెస్టు చేస్తున్నామని వెల్లడించారు. అయితే విద్యార్ధుల అరెస్టుపై డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. విదేశీ విద్యార్ధుల పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రూరంగా వ్యవహరిస్తున్నారని సెనెటర్ ఎలిజబెత్ వారెన్ తీవ్రంగా విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story