అర్జున్‌ సురవరం : మూవీ రివ్యూ

అర్జున్‌ సురవరం : మూవీ రివ్యూ

arjun-suravaram

నటీనటులు : నిఖిల్ సిద్దార్ధ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య, పోసాని, నాగినీడు, ప్రగతి,విద్యుల్లేఖ,తరుణ్ అరోరా తదితరులు.

దర్శకత్వం : సంతోష్ టి ఎన్

నిర్మాత‌లు : రాజ్ కుమార్ ఆకెళ్ళ, వేణు గోపాల్ కావియా

సంగీతం : శ్యామ్ సి ఎస్

సినిమాటోగ్రఫర్ : సూర్య

ఎడిటర్: నవీన్ నూలి

చాలా కాలంగా విడుదలకు ఫైట్ చేస్తున్న అర్జున్ సురవరం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి స్టార్ ప్రీరిలీజ్ ఈవెంట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి సినిమా పై ఆసక్తిని పెంచారు. తమిళ సినిమా కనిథాన్ కు రీమేక్ అయిన అర్జున్ సురవరం తెలుగు ఆడియన్స్ ని ఎంత వరకూ రీచ్ అయ్యిందో చూద్దాం...

కథ :

అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) టివి ఛానెల్ ల్లో జర్నిలిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ బిబిసికి సెలెక్ట్ అవుతాడు. తను ప్రేమించిన కావ్య కూడా అదే ఛానల్ లో పనిచేస్తుంటుంది. అర్జున్ ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ లో ఇరుక్కుంటాడు. అతని జీవితం ఒక్కసారి తల్లక్రిందులవుతుంది. ఆ స్కామ్ నుండి బయటకు రావడానికి అతను ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు..? ఆ ఇన్విస్టిగేషన్ లో అతనికి చాలా అంతు చిక్కని ప్రశ్నలు ఎదరవుతాయి..? మరి వాటిని ఎలా ఛేదించాడు..? అతని పై పడిన ఆరోపణలనుండి ఎలా బయటపడతాడు అనేది మిగిలిన కథ..?

కథనం:

నిఖిల్ కొంత గ్యాప్ తర్వాత అయినా మరి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫేక్ సర్టిఫికేట్స్ రాకెట్ చుట్టూ నడిచే కథలో చాలా సన్నివేశాలు నిజజీవితంలో చూసినవి. లేదా వార్తల్లో కనపడినవే, కానీ వాటిని విడివిడిగా కాకుండా ఒక పాయింట్ గా చూస్తే అదెంత పెద్ద సమస్యో తెలుస్తుంది. ప్రతి క్రైమ్ వెనక కూడా ఆ బాధితుల కథనాలుంటాయి. వాటిని ఎంత ఎఫెక్టివ్ గా ప్రొజెక్ట్ చేయగలిగితే ఆ సమస్య పై ప్రేక్షకులు అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అర్జున్ సురవరంలో దర్శకుడు ఆ విషయంలో చాలా మంచి సబ్ స్టోరీస్ ని బిల్డ్ చేయగలిగాడు. అందులో ఒకటి అర్జున్ తో పాటు ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ లో ఇరుక్కొన్న ఒక బాధితుడి కథ.. నిజంగా ఆ ఐదు నిముషాలు కూడా చాలా ఎమోషనల్ గా కథను నడిపాడు.. అలాగే చత్రపతిశేఖర్ కథ కూడా అంతే ఇంపాక్ట్ ని కలిగించింది. ఇక నిఖిల్ ఇందులో మంచి నటన కనబరిచాడు. సత్య, వెన్నెల కిషోర్ ల కామెడీ కూడా చాలా బాగా కుదరింది. ఏదో కామెడీ చేయడానికి అని కాకుండా వారి పాత్రలను కథతో పాటు నడిపాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ కామెడీతో పాటు కొన్ని సన్నివేశాల్లో సెంటిమెంట్ ని కూడా పండించాడు. లావాణ్య త్రిపాఠి పాత్ర కూడా కథతో పాటు నడుస్తుంది. కట్ చేస్తే పాట అనే ప్యాట్రన్ ని ఫాలో అవకుండా కథను గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి నిఖిల్ లోని కమర్షియల్ హీరో పూర్తి స్థాయిలో విజృంభించాడు. అతన్ని పూర్తి యాక్షన్ హీరోగా మర్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు అని అర్ధం అవుతుంది. అదే అర్జున్ సూరవరం స్పీడ్ ని తగ్గించింది. హీరో, విలన్ కి మద్య వార్ ప్రీ క్లైమాక్స్ కి వచ్చే వరకూ దొబూచులాటగానే ఉంటుంది. టివి ఛానెల్స్ రిపోర్టర్స్ ని కొట్టడం.. మీడియా ఆఫీస్ ల మీద దాడులు సినిమాటిక్ గా అనిపించాయి. అయినా తీసుకున్న పాయింట్ పై నుండి కథను తప్పించకుండా కథనం నడపగలిగాడు దర్శకుడు. నిఖిల్ ఫెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడతాయి. థ్రిలర్స్ ని ఇష్టపడే వారికి అర్జున్ సురవరం నచ్చుతాడు.

చివరిగా:

డీసెంట్ థ్రిల్లర్

Tags

Read MoreRead Less
Next Story