జగన్‌ ఓ చేత్తో అన్నం పెట్టి మరో చేత్తో లాగేస్తున్నారు : ఎమ్మెల్సీ మాధవ్‌

జగన్‌ ఓ చేత్తో అన్నం పెట్టి మరో చేత్తో లాగేస్తున్నారు : ఎమ్మెల్సీ మాధవ్‌
X

mlc-madhav

ఏపీలో బీజేపీ బలపడుతోందన్నారు ఆ పార్టీ శాసనమండలి ఫ్లోర్‌ లీడర్‌ మాధవ్‌. ఓ చేత్తో అన్నం పెట్టి మరో చేత్తో జగన్‌ లాగేస్తున్నారని విమర్శించారాయన. మాతృభాషపై ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు మాధవ్‌. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల సహా అన్నీ వివాదాలేనన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 10 రోజులపాటు తిరుమల ఆలయాన్ని తెరిచి ఉంచడం ఆగమ విరుద్ధమని, తిరుపతిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ నిధులను వినియోగించకూడదని మాధవ్‌ అన్నారు.

Tags

Next Story