నాన్నా నన్ను క్షమించు.. జైల్లో ఉన్న కీర్తి..

నాన్నా నన్ను క్షమించు.. జైల్లో ఉన్న కీర్తి..

keerthi

ఒక ప్రియుడితో వ్యవహారం బెడిసి కొట్టింది.. మరో ప్రియుడికి దగ్గరైంది.. అమ్మకు అది నచ్చలేదు. ఇలా ఎంత మందిని మారుస్తావు. మొదట ప్రేమించిన వాడితో పెళ్లి కూడా నిశ్చయమైంది కదా అని గట్టిగానే మందలించింది. అదే కూతురు కీర్తికి నచ్చలేదు. నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా.. అడ్డు చెప్పడానికి నువ్వెవరు అని ప్రియుడితో కలిసి అమ్మని హత మార్చింది. కూతురు అనే బంధానికే కళంకం తెచ్చింది. తాను చేసిన తప్పేంటో తెలుసుకుని ఇప్పుడు జైల్లో కూర్చుని రోదిస్తోంది. తనని చూడడానికి తొలిసారిగా వచ్చిన నాన్నను చూసి భోరున విలపించింది. ఆయన కూడా బిడ్డను చూసి భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది. రెండో ప్రియుడు బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో తల్లి హత్యకు సహకరించానని కీర్తి తండ్రితో చెప్పినట్లు సమాచారం. తనను బెయిల్‌పై తీసుకెళ్లమని తండ్రిని బతిమాలుతోంది. ఎలా చెబితే అలా నడుచుకుంటానని ఆయన్ని వేడుకుంటోంది. కాగా కీర్తి రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఆమెను గురువారం హయత్‌నగర్ కోర్టులో హాజరు పరిచారు.

Read MoreRead Less
Next Story