తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

kcr

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన కార్యచరణ రూపొందిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇటీవల సమృద్ధిగా కురిసిన వర్షాలతో నదులు, చెరువుల్లోని కావాల్సినంత నీరు వచ్చి చేరిందన్నారు. అలాగే వర్షాలతో డ్యామేజ్ అయిన రోడ్ల మరమ్మత్తులకు 571 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు సీఎం. రెండు మూడు నెలల్లోనే రోడ్ల మరమ్మత్తు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.

గురువారం సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్టీసీతో పాటు మరో రెండు ప్రధాన అంశాలపై చర్చించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ధాన్యం కొనుగోలు, రోడ్ల మరమ్మత్తులపై డిస్కస్ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయని.. దాంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఆర్ అండ్ బీ అధికారులతో చర్చించామని.. రోడ్ల మరమ్మతులకు రూ.571 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని హైవేలు, ఇతర రోడ్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు చేస్తామన్నారు.

ఇక ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించినట్టు సీఎం వివరించారు. వర్షాలు సమృద్ధిగా పడటంతో ప్రాజెక్టుల్లోకి, చెరువుల్లోకి నీరు వచ్చి చేరాయని చెప్పారు. రాజరాజేశ్వర ప్రాజెక్టు వరకు కాళేశ్వరం విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క పాలమూరు జిల్లాలో 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు కేసీఆర్.

సూర్యపేట జిల్లా రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి విడుదల సూర్యపేట జిల్లాకు పరుగులు పెడుతున్న జలాలను ఏప్రిల్ మాసాంతానికి పంపిణీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Next Story