శ్రీహరికోట 'ఇస్రో'లో ఉద్యోగాలు.. డిగ్రీ చదివిన వారికీ అవకాశం

శ్రీహరికోట ఇస్రోలో ఉద్యోగాలు.. డిగ్రీ చదివిన వారికీ అవకాశం
X

isro

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌‌లో ఇప్పటికే 92 ఉద్యోగాలకు 2 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. తాజాగా మరో 45 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ పాసైనవారికి కూడా కొన్ని పోస్టుల్ని కేటాయించారు. ఈ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 మధ్య వేతనం ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అప్లికేషన్లు వేర్వేరుగా సబ్మిట్ చేయాలి.

మొత్తం ఖాళీలు: 45.. ఎంపీసీ (ఫిజిక్స్): 1.. లైబ్రరీ అసిస్టెంట్: 1.. కంప్యూటర్ సైన్స్: 1.. ఆటోమొబైల్ ఇంజనీరింగ్: 1.. కెమికల్ ఇంజనీరింగ్: 4.. సివిల్ ఇంజనీరింగ్: 4.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 3.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 5.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 5.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: 2.. మెకానికల్ ఇంజనీరింగ్: 16.. మెకానికల్ ఇంజనీరింగ్ (బాయిలర్ ఆపరేషన్స్): 1.. ఫైన్ ఆర్ట్స్ (ఫోటోగ్రఫీ): 1.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 నవంబర్ 23.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 13 సాయింత్రం 5 గంటలు.. విద్యార్హత: పోస్టులను బట్టి.. వయసు: 18 నుంచి 45 ఏళ్లు.. దరఖాస్తు ఫీజు: రూ.100.

Next Story