ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం.. తొలిదశలో..

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా శనివారం ఆరు జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. 3 వేల 906 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఝార్ఖండ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. తొలి దశలో బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తుండగా.. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఇక బీజేపీకి పోటీగా కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. శనివారం నుంచి ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 23న ఫలితాలు వెలువడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com