ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర మంత్రి సత్యవతిని అడ్డుకున్న స్థానికులు

ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర మంత్రి సత్యవతిని అడ్డుకున్న స్థానికులు

satyavat-rathod

మానవ మృగాల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసుల తీరుపై మంత్రిని నిలదీశారు. నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేసేలా ఆదేశాలివ్వాలి అంటూ నినాదాలు చేశారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ మంత్రికి అడ్డుగా నిలబడి డిమాండ్ చేశారు. దీంతో ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను కలవకుండానే మంత్రి సత్యవతి రాథోడ్ తిరిగి వెనక్కు వెల్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story