హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

car-acci

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లంతా మాదాపూర్‌లోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో లాంగ్‌ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. గురువారం రాత్రి ఓ స్నేహితుడి బర్త్‌డే పార్టీ ఉందని హాస్టల్‌లో చెప్పకుండా.. క్యాంపస్ గోడ దూకి 9 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. రాజేంద్రనగర్ వెళ్లి.. తిరిగి వస్తుండగా ఆరాంఘర్ చౌరాస్తా వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న సఫారీ కారు ప్రమాదానికి గురైంది. సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కారు బోల్తా పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఉదయ్, తరుణ్ అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో సఫారీ కారు నుజ్జునుజ్జు అవడం చూస్తే ఓవర్ స్పీడ్ కారణంగానే కారు కంట్రోల్ తప్పి.. యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story