ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయంపట్ల అమెరికన్ ప్రజలు హర్షం

ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయంపట్ల అమెరికన్ ప్రజలు హర్షం

Screenshot_1

చైనా విషయంలో అమెరికా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. గత కొంత కాలంగా హాంకాంగ్ లో జరుగుతున్న ఆందోళనకు ట్రంప్ సర్కారు మద్దతు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్ ఆందోళనకు మద్దతు తెలుపుతూ తీసుకున్న నిర్ణయంపై సెనెట్, ప్రతినిధుల సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇరు సభల్లో ఆమోదం పొందిన బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆందోళనలు అణచివేయడంలో పోలీసులు అనుసరిస్తున్నవిధానంపై కూడా చట్టసభలు ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తంచేశాయి.

టీయర్ గ్యాస్,పెప్పెర్ స్రై, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. చైనా అధ్యక్షుడు జీ జింపింగ్, హాంకాంగ్ ప్రజల మీద ఉన్న గౌరవంతోనే ఈ బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ తెలిపారు. శాశ్వత శాంతిస్థాపనకు ఇరుదేశాధినేతలు కృషిచేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపట్ల అమెరికన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story